'భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి'
ప్రకాశం: మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. “జల ధార-నీటి భద్రత” కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముందుగా 10 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, తదుపరి 80 రోజుల్లో చెరువుల పూడిక తీయడం, భూగర్భ జలాల పెంపు చర్యలు చేపట్టాలని తెలిపారు.