నేటి నుంచి శ్రీశైలానికి బస్సు సర్వీసులు

NRPT: నేటి నుంచి నారాయణపేట బస్సు డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి డీలక్స్ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. బుధవారం ఉదయం 5:40 గంటలకు శ్రీశైలంకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరిగి అక్కడి నుంచి అదే రోజు ఒంటి గంటకు బయలుదేరి రాత్రి 8 గంటలకు నారాయణపేటకు వస్తుందన్నారు.