శంకర్‌పల్లిలో 11 గంటల వరకు 53 శాతం పోలింగ్ నమోదు
RR: శంకర్‌పల్లి మండల పరిధిలోని 22 గ్రామాలలో ఉదయం 11 గంటల వరకు 53% పోలింగ్ నమోదు అయినట్లు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. 34,700 మంది ఓటర్లకు గాను, పురుషులు, మహిళలు, వృద్ధులు కలిపి 18,439 మంది ఓటర్లు ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. మరో గంటలో ఓటింగ్ శాతం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని తెలియజేశారు.