కలుషితమయంగా మారుతున్న అంబీర్ చెరువు..!

మేడ్చల్: బాచుపల్లి పరిధిలోని అంబీర్ చెరువు కలుషితమయంగా మారుతుందని, అక్రమ దారుల చేతిలోకి వెళ్తుందని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ రెవిన్యూ అధికారులకు ప్రత్యేకంగా నోటీసులు జారీ చేశారు. దీనిపై నివేదిక అందించాలని ఆదేశించారు. అంబీర్ చెరువు కలుషిత వ్యర్ధాలతో నిండిపోతుందని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.