బాపట్లలో వైసీపీ శ్రేణులు ధర్నా

బాపట్లలో వైసీపీ శ్రేణులు ధర్నా

గుంటూరు: వైసీపీ పార్టీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ బాపట్లలో వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని జి బి సి రోడ్డు నందు వైసీపీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఓటమి భయంతోనే టీడీపీ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను కాపాడుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు.