బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వినతి

బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని వినతి

ADB: భీంపూర్ మండలంలోని కరంజి గ్రామం వరకు బస్సు సౌకర్యాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని కోరుతూ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డిని మండలవాసులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అర్లి గ్రామం వరకే బస్సు సౌకర్యం ఉండటం వల్ల అంతర్గావ్, గోమూత్రి, కరంజి గ్రామాల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.