LIC ఏజెంట్ కుటుంబానికి ఆర్థిక సాయం
PLD: నరసరావుపేటకు చెందిన LIC ఏజెంట్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు LIC రూ. 20,000 డెత్ రిలీఫ్ ఫండ్ అందజేసింది. 35 ఏళ్లుగా సేవలందించిన ఆయన ఏప్రిల్ 22న మృతిచెందారు. ఈ మేరకు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.