ఊటగుండం ప్రధాన రహదారి నిర్మాణానికి రేపు శంకుస్థాపన
కృష్ణా: కోడూరు- ఊటగుండం ప్రధాన రహదారి నిర్మాణానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. నాబార్డ్ నిధులు రూ.2 కోట్ల నలభై లక్షలతో కోడూరు- ఊటగుండం ప్రధాన రహదారి దాదాపు పది కిలోమీటర్ల మేరకు నూతన రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది.