'ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్'
KNR: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, ఇంఛార్జ్ కార్యదర్శి కే. రాణి ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్, సివిల్, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులు సహా వివిధ కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.