చంద్రగ్రహణం సందర్భంగా కీసర ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా కీసర ఆలయం మూసివేత

మేడ్చల్: ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం మధ్యాహ్నం 1 గంటకు మూసి వేసారు. నిత్య కైంకర్యాలు, నివేదన పూర్తి అనంతరం ఆలయం ద్వార బంధనం చేశారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టి స్వామి వారికి అభిషేకాల అనంతరం ఉదయం 6 గంటలకు భక్తులకు దర్శనాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.