బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

KMM: రేపు వైరా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ పర్యటనలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్‌ను డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా, శుక్రవారం డిప్యూటీ సీఎం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా స్థలాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.