జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
NGKL: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో బిజినపల్లిలో అత్యల్పంగా 10.9 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండ 11.2 డిగ్రీలు, పదర 11.5 డిగ్రీలు, ఐనోల్ 11.6 డిగ్రీలు, అచ్చంపేట 11.8, ఊర్కోండ 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.