ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
NLR: దిత్వా తుఫాను తీరం దాటే వరకు తీర ప్రాంత మత్స్యకారులు, పెన్నా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం కోరారు. అత్యవసర పరిస్థితుల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సహాయ చర్యలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు.