'సమస్యలను సత్వరమే పరిష్కరించాలి'

AKP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె అర్జీదారులతో మాట్లాడారు.