జిల్లా అధికారులతో సమీక్షించిన కలెక్టర్
VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు.