గండీడ్‌లో పర్యటించిన జిల్లా కలెక్టర్

గండీడ్‌లో పర్యటించిన జిల్లా కలెక్టర్

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గండీడ్ మండల క్లస్టర్‌ను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల వివరాలను, అలాగే ఏకగ్రీవం అయిన గ్రామపంచాయతీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులతో నూతన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు.