నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా లోగో ఆవిష్కరణ
VSP: సీతమ్మధార వైసీపీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు, కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సోషల్ మీడియా లోగోను ఆవిష్కరించారు.