'ప్రభుత్వం బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది'

'ప్రభుత్వం బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది'

MBNR: కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి మాట తప్పారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని జిల్లా బీజెపి పార్టీ అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించిన ఆయనే ఇప్పుడు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.