VIDEO: రామలింగేశ్వరుడుని దర్శించుకున్న భువనేశ్వరి పీఠాధిపతి
HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలో కొలువుదీరిన శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారిని శనివారం భువనేశ్వరి పీఠాధిశ్వరులు కమలానంద భారతి స్వామి వారు హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు రాగిచెడు అభిలాష్ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి దగ్గరుండి అభిషేక అర్చనలను చేయించారు.