ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

CTR: వీకోట మండలంలో భారీ వర్షం కురిసింది. నేర్నపల్లి పంచాయతీ దయ్యాలపల్లి ఎస్సీకాలనీలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లల్లోకి నీరు చేరుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.