రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు...తనిఖీలు

రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు...తనిఖీలు

SRD: మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారులో తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పోలీసులు శుక్రవారం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రూ. 50 వేలు కంటే అధికంగా నగదు, కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తే స్వాధీనం చేసుకుంటామన్నారు.