టీడీపీ జిల్లా అధ్యక్షుడితో రెహ్మాన్ భేటీ
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన చోడె పట్టాభిరాంను శుక్రవారం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్.ఎ.రెహ్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు.