రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ADB: ఉట్నూర్ నుంచి నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి వెళ్తున్న విజయ్ పుసిగూడ ఘాట్ వద్ద బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. పైలట్ సోయల్, ఈఎంటీ ప్రదీప్ తక్షణమే స్పందించి అతనిని ఉట్నూర్‌కు తీసుకెళ్లి బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యం కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.