నేడు దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

నేడు దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

HNK: జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం -2025 వేడుకలను నేడు అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందులో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.