భారత సైన్యం క్షేమంగా ఉండాలని పూజలు

ATP: భారతదేశ సైన్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ గుంతకల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ జగదీష్ మాట్లాడుతూ..అమ్మవారి ఆశీస్సులు మన భారత సైన్యానికి ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని లక్ష పుష్ప అర్చన కార్యక్రమం నిర్వహించామన్నారు.