VIDEO: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు
అన్నమయ్య: కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన సవతి కొడుకు కృష్ణప్ప, తాను ఇంట్లో లేని సమయంలో ఇంటి పత్రాలు, నగదు, బంగారాన్ని అపహరించి, తనను ఇంట్లో నుంచి గెంటేసి వీధిపాలు చేశాడని ఆమె ఆరోపించారు. తనకు ఆశ్రయం కల్పించి, ఆస్తి పత్రాలు తిరిగి ఇప్పించాలని కొండమ్మ ఎస్పీని వేడుకున్నారు.