ఆర్డీటీ డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌కు లోకేశ్‌ శుభాకాంక్షలు

ఆర్డీటీ డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌కు లోకేశ్‌ శుభాకాంక్షలు

ATP: ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌కు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగు, విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు, మహిళా సాధికారతకు ఆర్డీటీ చిరునామాగా మారిందని కొనియాడారు. అచ్చమైన అనంతపురం వాసిగా మనలో ఒకరిగా కలిసిపోయిన మాంచో ఫెర్రర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్థిల్లాలని, ఆర్డీటీ సేవా ప్రస్థానం కొనసాగాలని ఆకాంక్షించారు.