మీ డబ్బు - మీ హక్కు పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
NDL: 'మీ డబ్బు – మీ హక్కు' అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. ఇవాళ నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో 'మీ డబ్బు – మీ హక్కు' అనే గోడ పత్రికను విడుదల చేశారు. తమ ఆర్థిక హక్కులను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.