పబ్లిక్ అలర్ట్.. పెద్ద పులి సంచారం

పబ్లిక్ అలర్ట్..  పెద్ద పులి సంచారం

E.G: కోరుకొండ మండలం కాపవరం గ్రామం పాండవుల మెట్ట వద్ద పెద్దపులి కదలికలు గుర్తించిన నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గురువారం సంఘటన ప్రాంతాలను పరిశీలించి, అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ప్రథమ ప్రాధాన్యతని, పులిని బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.