పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ASR: డుంబ్రిగుడ మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి సుందర్ రావు తెలిపారు. రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంలో మొత్తం మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో మొత్తం 595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాన్నారన్నారు.