డోన్‌లో భారీగా నగదు.. 21 ఫోన్లు స్వాధీనం..!
NDL: డోన్ జాతీయ రహదారిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో DSP ఆధ్వర్యంలో తెల్లవారుజామున సీఐ ఇంతియాజ్ తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. లక్ష ఐదువేల విలువైన 21 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోనగా... దొంగ ఫోన్‌లు అమ్మి డబ్బు సంపాదించుకుంటున్నారని విచారణలో తెలిసింది.