ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో
SRPT: కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన మండల గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కోదాడ ఆర్డీవో సూర్య నారాయణ శనివారం తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.