'వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుంది'
MHBD: వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుందని కొత్తగూడ FRO వజహాత్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని రేంజ్ పరిధిలోని కార్లాయి, బత్తులపల్లి సెక్షన్ అధికారుల ఆధ్వర్యంలో పోలరం కస్తూర్బా పాఠశాలలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించారు.