అక్రమ మొరం రవాణా.. టిప్పర్ స్వాధీనం
NRPT: కృష్ణ మండలం ఖాన్‌దొడ్డి గ్రామ శివారులో పోలీసుల గస్తీ సమయంలో అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై నవీద్ తెలిపారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా మొరం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.