అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడులు
SDPT: మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై సిద్దిపేట కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుబడినట్లు తెలిపారు. ఈ మేరకు మద్దూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు SI ఆసిఫ్ తెలిపారు.