సింగూరు డ్యాంకు శాశ్వత మరమ్మతులు చేస్తాం: మంత్రి

SGR: రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సింగూరు డ్యాంకు ఎంత ఖర్చు అయినా శాశ్వత మరమ్మతులు చేయిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం పదేళ్లు సింగూరు డ్యాంపై నిర్లక్ష్యం వహించిందన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.