VIDEO: అధ్వానంగా మారిన మురికి కాలువలు

JGL: లవెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో గల ప్రధాన మురుగు కాలువలలో మురుగు తీయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా చెత్త కాలువల పేరుకుపోయాయని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తీసేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.