నేడు అన్ని విద్యాసంస్థలకు సెలవు

నేడు అన్ని విద్యాసంస్థలకు సెలవు

SRCL: రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలు, అంగన్వాడీలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్టు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నామని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.