బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై అమిత్ షా కసరత్తు
బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభమైంది. కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో NDA కూటమిలోని పార్టీలకు ఏఏ శాఖలను కేటాయించాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై కూడా కొలిక్కివచ్చినట్లు సమాచారం. కాగా బీహార్ సీఎంగా నితీశ్ మళ్లీ బాధ్యతలను చేపట్టనున్నారు.