రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చోరీ

రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చోరీ

ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చోరీలు జరిగాయి. జైపూర్-మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సౌందర్య అనే మహిళ నుంచి రూ.2 లక్షల విలువైన బంగారు గొలుసును దుండగుడు అపహరించాడు. అలాగే గుంటూరు-కాచిగూడ రైలులో ప్రయాణిస్తున్న సురేఖ అనే మహిళ మెడలో నుంచి రూ.3.50 లక్షల విలువైన గొలుసును కోట్ల రైల్వే స్టేషన్ వద్ద దొంగిలించారు.