VIDEO: ఎల్‌ఐసీ బిల్డింగ్ సమీపంలో అగ్నిప్రమాదం
VSP: విశాఖలోని రెండోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్‌ఐసీ బిల్డింగ్ సమీపంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సమీపంలోని ఒక దుకాణం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై రెండోవ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఎంతమేర ఆస్తినష్టం వాటిల్లిందో ఇంకా తెలియరాలేదు.