రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి
KNR: చిగురుమామిడి మండలం రేకొండలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన పొలం వద్దకు వెళ్తున్న గోపగొని రమేష్‌ను ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ మరణించారు. రమేష్ మరణంతో రేకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.