సమస్య పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: SP
ADB: ప్రతి ఒక సమస్య పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. 32 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవించినట్లు తెలిపారు. సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత ఉన్నారు.