ఓటర్ల జాబితా సవరణపై సీఈఓ సమీక్ష
KMM: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై రాష్ట్ర ఎన్నికల సీఈఓ సుదర్శన్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలని, ముందస్తు చర్యల్లో పురోగతి ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు.