కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న నేతలు
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి హాజరై, మాట్లాడారు. పంట నష్టం పరిహారం, సాగు చట్టాల రద్దు, రైతు సమస్యలపై వెంటనే కేంద్రం స్పందించాలన్నారు. BHPL జిల్లా యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాణి, మండలం అధ్యక్షుడు క్రాంతి పాల్గొన్నారు.