ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ఆడ్లూర్ రైతులు
KMR: సదాశివనగర్ మండలం ఆడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ రైతులు శనివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తరలివెళ్లారు. అక్కడ జరిగే అభ్యుదయ రైతుల ముఖాముఖిలో వీరు పాల్గొంటారని ఏఈఓ కళ్యాణి తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఉచిత రవాణా, భోజన వసతి కల్పించిందని ఆమె పేర్కొన్నారు. సాగు మెళకువలు తెలుసుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు.