నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

NRPT: ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ.6,845 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆటో డ్రైవర్ అభిబును అదుపులోకి తీసుకుని విచారించగా, మహబూబ్ నగర్‌కు చెందిన వ్యక్తి ఈ సరుకును పంపినట్లు వెల్లడైంది.