'ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'

KMM: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం తిరుమలాయపాలెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.