రాజాపేటలో ముగిసిన గురుకుల జోనల్ స్థాయి క్రీడలు
BHNG: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో, రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమంలో రాజాపేట ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఆటలో గెలుపు ఓటములు సహజం అని, విద్యార్థి దశ నుంచే కష్టపడడం అలవాటు చేసుకోవాలని సూచించారు.