'రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి'

'రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి'

ATP: అనంతపురం నగరంలో డీలర్ల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. పలువురు స్టోర్ డీలర్లు అర్బన్ MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకున్నారు. డీలర్లతో MLA ఫోన్‌లో మాట్లాడారు. పలువురి స్టోర్ డీలర్లపై తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే సరి చేస్తానన్నారు.